గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా ?

2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ … అధికారం కోసం కాదు ప్రశ్నించటం కోసం అంటూ తన పంథా ని చెప్పుకున్న పవన్ ఆ ఎన్నికలలో రాష్ట్రంలో టీడీపీ కి కేంద్రం లో బీజేపీ కి సపోర్ట్ ఇచ్చాడు. అటు సినిమాలు చేసుకొంటూ గత 4 సంవత్సరాల నుండి ఏదో కొన్ని సందర్భాలలో బయటకు వచ్చి కొన్ని సమస్యల మీద తన గళాన్ని వినిపించాడు. ఇప్పుడు అనూహ్యంగా గత మూడు నెలలుగా రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టాడు. మొన్నామధ్య జరిగిన జనసేవ ఆవిర్భావ సభ లో ఆంధ్ర ప్రదేశ్ హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటూ సంచలన ప్రకటన చేశాడు. కానీ కొన్ని గంటల్లోనే జాతీయమీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో హోదా కన్నా కూడా నిధులు ముఖ్యమంటూ మాట్లాడాడు.

ఈ వ్యాఖ్యలపై జనాల స్పందన తెలుసుకొనే ప్రయత్నం మా ఈ తెలుగు జర్నలిస్ట్ చేస్తుంది. దీనికోసం క్రింద ఒక పోల్ ని పెట్టాము. దయచేసి మీ అభిప్రాయాన్ని క్రింద ఓటు ద్వారా తెలియచేయగలరు.

Comments

comments

Leave a Reply

*